పిల్లల్ని కనడం తగ్గించేస్తున్న మహిళలు

By udayam on May 6th / 1:42 pm IST

దేశంలో మహిళలు పిల్లలు కనే శాతం తగ్గుతోందని జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వేలో తేలింది. గతంలో ఈ పిల్లల్ని కనే శాతం 2.2గా ఉంటే ప్రస్తుతం అది 2 శాతానికి తగ్గిందని తెలిపింది. తెలంగాణలో 1.8 శాతంగానూ, ఎపిలో 1.7 శాతానికి తగ్గిందని పేర్కొంది. బీహార్​ 2.98, మేఘాలయ 2.91, ఉత్తరప్రదేశ్​ 2.53, ఝార్ఖండ్​ 2.26 శాతంతో ఈ లిస్ట్​లో ముందున్నాయి. గర్భనిరోధక పద్దతులు వాడుతున్న వారు 67 శాతానికి పెరగడమే దీనికి కారణమని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో సిజేరియన్​ డెలివరీలు పెరిగాయి.

ట్యాగ్స్​