ఫిఫా ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదైంది. వరుసగా రెండు విజయాలతో అందరికంటే ముందే ప్రిక్వార్టర్స్ బెర్తు దక్కించుకున్న డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ కు ఆఖరి లీగ్ మ్యాచ్ లో అనామక ట్యునీషియా షాకిచ్చి మెగా టోర్నీలో సంచలనం రేపింది. బుధవారం రాత్రి జరిగిన ఈ పోరులో ట్యునీషియా 1-0తో ఫ్రాన్స్‌ను ఓడించింది. మరో మ్యాచ్‌లో డెన్మార్క్‌ను ఆస్ట్రేలియా ఓడించడంతో ట్యునీషియాకు నాకౌట్ బెర్తు దూరమైంది.