భారత నౌకాదళంలో చేరిన వాగిర్​ జలాంతర్గామి

By udayam on December 21st / 7:53 am IST

స్కార్పియన్‌ తరగతికి చెందిన ఐదవ జలాంతర్గామి వాగిర్‌ను మంగళవారం ముంబయిలోని మజాగాన్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండిఎల్‌), భారత నౌకాదళానికి అప్పగించింది. వచ్చే నెలలో వాగిర్‌ తన సేవలను ప్రారంభిస్తుందని నౌకాదళ అధికారులు తెలిపారు. గత జలాంతర్గామిలతో పోలిస్తే వాగిర్‌ అతి తక్కువ సమయంలో అన్ని ప్రధాన పరీక్షలను పూర్తి చేసుకోవడం గర్వించదగిన విషయమని నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది. 2020 నవంబరు 12న వాగిర్‌ జల ప్రవేశం కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 1నుండి సముద్ర జలాల్లో పరీక్షలు ప్రారంభించారు.

ట్యాగ్స్​