కొలంబియా రెబెల్ వర్గాల మధ్య శనివారం జరిగిన ఘర్షణల్లో 18 మంది మరణించారని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకుసంబంధించి మాజీ రెబెల్ ఆర్మీ ఫార్క్, మరో సాయుధ గ్రూపునకు మధ్య ఈ ఘర్షణలు తలెత్తాయి. ఈక్వెడార్‌తో గల సరిహద్దు సమీపంలో వాయవ్య కొలంబియాలో శనివారం ఘర్షణలు జరిగాయని ప్రభుత్వ ఆంబుడ్స్‌మన్ కార్యాలయం తెలిపింది. ప్రభుత్వంతో ఫార్క్ కుదుర్చుకును 2016 నాటి శాంతి ఒప్పందానిు తిరస్కరించిన రెబెల్స్, బోర్డర్ కమాండోస్‌గా పిలుచుకునే క్రిమినల్ బాండ్ మధ్య ఈ ఘర్షణలు చోటు చేసుకునాుయి.