దేశంలో తెరకెక్కుతున్న సినిమాలలో అసలు మీనింగ్ కంటే డబుల్ మీనింగ్లే ఎక్కువ ఉంటున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన సిరివెన్నెల జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘మీరు తీసే సినిమాలను ముందు మీరు మీ కుటుంబంతో కలిసి చూడండి. కొన్ని సినిమాలు వెగటు పుట్టిస్తున్నాయి. మొదటి రోజే ఫస్ట్ షో వరకూ కూడా కొన్ని సినిమాలు నిలబడడం లేదు. వన్‌టైమ్ హీరో.. హాఫ్ టైమ్ హీరోయిన్గా తయారయింది’ అని ఆవేదన చెందారు.