ఎఫ్ 3లోకి ఎంటరయిన మెగా ప్రిన్స్

By udayam on January 12th / 9:50 am IST

కరోనా నుంచి కోలుకున్న మెగా హీరో వరుణ్​ తేజ్​ తిరిగి తన తాజా చిత్రం ఎఫ్​ 3 సినిమా షూటింగ్​కు సిద్దమయ్యాడు.

విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా, బబ్లీ బ్యూటీ మెహరీన్‌ హీరోయిన్లుగా సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘ఎఫ్‌ 2’ మూవీ పెద్ద సక్సెస్‌ అయింది.

దాంతో ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎఫ్‌ 3’ మూవీ తెరకెక్కించాలని నిర్ణయించారు. కరోనా లాక్ డౌన్ తదితర కారణాల వలన ఆలస్యం అయిన ఈ చిత్ర షూటింగ్​ తిరిగి ఇటీవలే ప్రారంభమైంది.

చిత్ర షూటింగ్‌లోకి మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ జాయిన్‌ అయిన విషయం తెలుపుతూ.. దర్శకుడు అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు. దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.