ఫిన్లాండ్​: నాటోలో చేరతాం

By udayam on May 12th / 11:00 am IST

రష్యాతో 1300ల కి.మీ.లకు పైగా సరిహద్దులు కలిగి ఉన్న ఫిన్లాండ్​ తాజాగా నాటో తలుపు తట్టింది. రష్యా ఉక్రెయిన్​పై జరుపుతున్న మారణకాండను చూసి కళ్ళు తెరిచిన ఆ దేశం త్వరలో నాటో సభ్యత్వానికి అప్లై చేయనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు, ప్రధాని జాయింట్​ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంట్​లో ప్రవేశపెట్టనునున్నారు. నాటోలో చేరడంపై తొలి నుంచీ తటస్థంగా ఉన్న ఆ దేశ ప్రజలు ఇటీవల జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో 78 శాతం మంది నాటో సభ్యత్వానికి అంగీకరించారు.

ట్యాగ్స్​