నాటోలో చేరతామని గత ఆదివారం ప్రకటించిన స్వీడన్, ఫిన్లాండ్లు ఈరోజు అధికారికంగా తమ దరఖాస్తులను సమర్పించాయి. ‘ఈరోజు గుర్తుండిపోతుంది. ఈ దేశాల చేరికతో భాగస్వామ్య భద్రత మరింత పెరగనుంది’ అని నాటో కూటమి సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ అన్నారు. రష్యాతో ఫిన్లాండ్లకు 1300 కి.మీ.ల సరిహద్దు ఉండగా.. స్వీడన్‌కు 3,800 ల కి.మీ.ల మేర కోస్తా సరిహద్దు ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం ఈ రెండు దేశాలు తమ తటస్థ వైఖరిని కాదని నాటోలో చేరుతున్నాయి.