విద్యార్థులు జాతీయ గీతానికి బదులుగా ‘లాబ్ పే ఆతి హై దౌ’ అనే ఉర్దూ గీతం పాడినందుకు ఆ పాఠశాలలో ప్రిన్సిపాల్, శిక్షా మిత్రాను అరెస్టు చేయడంతో పాటు, విధుల్లోంచి తొలగించిన ఘటన యుపిలోని బరేలి జిల్లాలో జరిగింది. జిల్లాలోని మిర్ధాన్ ఫరిద్‌పూర్‌లో పాఠశాలలో ఉదయం అసెంబ్లీ సమయంలో విద్యార్థులు జాతీయగీతానికి బదులుగా ప్రముఖ కవి మహమ్మద్ ఇక్బాల్ రచించిన గీతాన్ని పాడారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పాఠశాల శిక్షా మిత్రాగా పనిచేస్తున్న 55 ఏళ్ల వాజీరుద్దీన్‌ను అరెస్టు చేశారు.