జైభీం రగడ: సూర్య, జ్యోతికలపై ఎఫ్​ఐఆర్​

By udayam on May 18th / 12:05 pm IST

సూర్య నటించి, నిర్మించిన జైభీమ్​ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని రుద్ర వన్నియర్​ సేన చేసిన ఫిర్యాదుపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. హీరో సూర్య, అతడి భార్య, నిర్మాత జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్​పై ఈ కేసు నమోదైనట్లు తెలిపారు. వేలచ్చేరి పోలీసులు నమోదు చేసిన ఈ కేసు విషయమై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగినా వీరిలో ఎవరూ కోర్టుకు హాజరుకాకపోవడంపై కోర్టు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​