4:40 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

అబిడ్స్‌లో ఓ భవనంలో అగ్నిప్రమాదం 2 weeks ago

హైదరాబాద్‌ : నగరంలోని అబిడ్స్‌లో ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాలుగో అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.

అయితే.. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భవనం కిందున్న జనాలు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంతో ఎంత మేరకు ఆస్తి, జన నష్టం వాటిల్లింది..? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.