5:05 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం 2 weeks ago

హైదరాబాద్​లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్టూడియోకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షూటింగ్‌ కోసం వేసిన సెట్‌లో షార్ట్ సర్య్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినప్పటికీ.. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్‌ స్టూడియోలో బిగ్‌బాస్‌ షూటింగ్‌ జరుగుతుండటంతో కొంత ఆందోళన నెలకొంది. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి కుడివైపున బిగ్‌బాస్‌ హౌజ్‌ ఉండటమే దీనికి కారణం. అయితే, మంటలు అదుపులోకి రావడంతో బిగ్‌బాస్‌ నిర్వహణకు ప్రమాదమేమీ లేదని తెల్సింది. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని స్టూడియో నిర్వాహకులు వెల్లడించారు.