5:38 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

ఐదంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం – ఇద్దరు మృతి 2 weeks ago

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలోని చంద్రా అవెన్యూలో ఐదంతస్తుల భవనంలో అగ్రి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలికతో పాటు మరో వృద్ధురాలు మృతి చెందింది. అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం భవనంలో ఉంటున్నవారందరినీ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఒక బాలిక భయంతో మూడవ అంతస్తు నుంచి దూకింది. ఆసుపత్రికి తరలించిన కొద్ది సేపటికే ఆ బాలిక కన్నుమూసింది. ఇక ఒక వృద్ధురాలి మృతదేహాన్ని సంఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.