దేశ రాజధాని ఢిల్లీలో కీర్తి నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి మూడు ఫ్యాక్టరీలలో మంటలు చెలరేగాయి. గురువారం అర్ధరాత్రి 1.50 గంటలకు ఈ మంటలు తలెత్తాయని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. దీంతో 12 అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనాస్థలంలో మంటలను అదుపు చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇక్కడ ఫర్నీచర్, ఫ్యాబ్రికేషన్ తయారీ ప్లాంట్లు ఎక్కువగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.