తిరుపతి: నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

By udayam on November 18th / 5:15 am IST

అహ్మదాబాద్​ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్​ ఎక్స్​ ప్రెస్​ ట్రైన్​ లో శుక్రవారం మంటలు చెలరేగాయి. ట్రైన్​ గూడురు జంక్షన్​ సమీపంలోకి రాగానే ట్రైన్​ లోని ప్యాంట్రీ కిచెన్​ నుంచి మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు.వెంటనే అప్రమత్తమైన అధికారులు గూడూరు రైల్వే స్టేషన్‌లో రైలును ఆపి మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ ఘటనతో సుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్‌లోనే రైలు నిలిచిపోయింది.

ట్యాగ్స్​