భారత్​లో బర్డ్ ఫ్లూ కలకలం

By udayam on July 21st / 6:18 am IST

భారత్​లోనూ బర్డ్​ ఫ్లూ పంజా విసురుతోంది. ఢిల్లీలోని ఎయిమ్స్​ ఆసుపత్రిలో H5N1 ఏవియన్​ ఇఫ్లుయెంజా (బర్డ్​ఫ్లూ)కు చికిత్స తీసుకుంటూ ఓ 12 ఏళ్ళ చిన్నారి మరణించాడు. దీంతో ఆసుపత్రిలోని మొత్తం సిబ్బందితో పాటు డాక్టర్లు సైతం ఐసోలేషన్​లోకి వెళ్ళారు. ఢిల్లీ ఎయిమ్స్​లోని డి5 వార్డ్​లో ఆ చిన్నారికి చికిత్స చేశారు. దీంతో ఆ వార్డు మొత్తాన్ని సీల్​ చేయడంతో పాటు ఐసియులను సైతం మూసేశారు. ఈ ఏడాదిలో తొలిసారిగా హర్యానాలో ఈ వైరస్​ బయటపడగా ఇది మనుషులకు సోకదని భావించారు.

ట్యాగ్స్​