బయల్దేరిన దివ్యౌషధం

సీరం ఇన్​స్టిట్యూట్​ నుంచి కరోనా వ్యాక్సిన్​ కంటైనర్లు బయటకు

By udayam on January 12th / 3:29 am IST

మరో నాలుగు రోజుల్లో కేంద్రం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్​ ప్రోగ్రామ్​ను మొదలు పెట్టనున్న సందర్భంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా నుంచి ఆక్స్​ఫర్డ్​– ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ కొవిషీల్డ్​ ట్రక్కుల్లో పుణె ఎయిర్​పోర్ట్​కు బయల్దేరాయి. ఈ ఎయిర్​పోర్ట్​ సీరమ్​ ఇన్​స్టిట్యూట్​కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ ఉన్న మూడు టెంపరేచర్​ కంట్రోల్డ్​ ట్రక్కులు సీరమ్​ ఇన్​స్టిట్యూట్స్​ గేట్లు నుంచి ఈరోజు ఉదయం 5 గంటలకు బయటకు దాటినట్లు అధికారులు తెలిపారు.

ఇవి నేరుగా పుణె అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దేశంలోని 13 ప్రాంతాలకు పంపిణీ చేరవేయబడతాయి.

ఒక్కో ట్రక్కులో 478 వ్యాక్సిన్​ బాక్సులు ఉండనున్నాయి. ఒక్కో బాక్సులో 32 కేజీల బరువు గల వ్యాక్సిన్​ బాటిల్స్​ ఉంటాయి.

వ్యాక్సిన్లతో ట్రక్కులు బయల్దేరడానికి ముందు పూజా కార్యక్రమాల్ని సైతం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 10 గంటలు సమయానికే ఇవి నిర్ధేశిత ప్రాంతాలకు చేరుకుంటాయి.