ప్రపంచంలోనే తొలిసారిగా మానవ శరీరంలోని క్యాన్సర్ కణాలను సమూలంగా నిర్మూలించే వైరస్‌ను ఓ వ్యక్తికి ఇంజెక్ట్ చేశారు. క్యాన్సర్ ట్యూమర్లను ఆపరేషన్ చేయకుండానే తగ్గించగలిగే సామర్థ్యం ఈ వైరస్‌కు ఉన్నట్లు తేలడంతో ఇప్పటి వరకూ జంతువులపై చేసిన ఈ ప్రయోగాన్ని తొలిసారిగా మనుషులపై నిర్వహిస్తున్నారు. పోక్స్ వైరస్‌కు జీన్ ఎడిటింగ్ చేసి CF33-hNIS (వక్సినియా) అనే డ్రగ్‌ను తయారు చేసినట్లు ఆస్ట్రేలియా, లాస్ ఏంజెల్స్ శాస్త్రవేత్తలు తెలిపారు.