అద్భుతంగా నావీ ముంబై ఎయిర్​ పోర్ట్​

By udayam on June 10th / 11:25 am IST

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో సరికొత్తగా నిర్మించనున్న అంతర్జాతీయ నావీ ముంబై ఎయిర్​పోర్ట్​ ఫస్ట్​ లుక్​ను జివికె సంస్థ విడుదల చేసింది. బంగారు వర్ణంలో మెరుస్తున్నట్లున్న ఈ ఎయిర్​పోర్ట్​ ఆకారం పూర్తిగా విచ్చుకున్న కమలం రేకుల్లా ఉంటుందని దీనిని కడుతున్న జివికె వెల్లడించింది. ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్స్​ జాహ హదీద్​ దీనిని డిజైన్​ చేశారు. బీజింగ్​లో ఇటీవల కట్టిన డక్సింగ్​ ఎయిర్​పోర్ట్​ను సైతం ఇదే సంస్థ రూపొందించడం విశేషం.