మైసూరు: ఆడ మగ రెండు వర్గాలే కాకుండా ట్రాన్స్ జెండర్ మూడో వర్గం కూడా ఉంది. అయితే ట్రాన్స్జెండర్లు అంటే అదోరకమైన భావన.
అందుకే సమాజంలో అందరితో సమానంగా జీవించేందుకు అనేక హక్కులు సాధించుకున్న ట్రాన్స్జెండర్లు నైపుణ్యాలు పెంపొందించుకొని వివిధ రంగాల్లో రాణిస్తున్నారు.
ఇందులో భాగంగా కర్ణాటకలో తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు.
మైసూరులోని జయనగర నివాసి శశికుమార్ అలియాస్ శశి ప్రస్తుతం ఒక సీనియర్ న్యాయవాది వద్ద సహాయకురాలిగా పని చేస్తున్నారు.
14 ఏళ్ళ ప్రాయంలో యువకు డిగా ఉన్న ఈయన హార్మోన్స్‌లో వచ్చిన మార్పులతో యువతిగా మారాడు. మైసూరులోని అశోకపురంలో ఉన్న సిద్ధార్థ పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు చదివారు.
తర్వాత మైసూరులో సైన్స్(పీసీఎంబీ) చదివారు. తర్వాత కువెంపు నగరంలో ఉన్న సోమాని కళాశాలలో ఆర్ట్స్ విభాగంలో శశి శిక్షణ పొంది కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీలో ప్రజా పరిపాలన కోర్సు చదివారు.
2018లో విద్యావర్ధక లా కళాశాలలో చేరి మూడేళ్ల లా కోర్సు పూర్తి చేశారు. అయితే పంచకర్మ వైద్యురాలు డా. జే.రశ్మిరాణి నా ఉన్నత చదు వులకు ఫీజులు చెల్లించి ఎంతో సహకారం అందించారు. మున్ముందు న్యాయమూర్తిగా ఎదగాలనేది నా ఆశయం’ అని శశి తెలిపారు.