అక్టోబర్​ 7 నుంచి ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​

By udayam on September 21st / 6:33 pm IST

దేశీయ ఈ–కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ ఏడాదికోసారి నిర్వహించే బిగ్​ బిలియన్​ డేస్​కు ముహూర్తం ఫిక్స్​ అయింది. అక్టోబర్​ 7 నుంచి 12వ తేదీ వరకూ 6 రోజుల పాటు ఈ సేల్​ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అత్యధికంగా 90 శాతం డిస్కౌంట్​ను ఈ సేల్​లో ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్​, ఫ్యాషన్​, బ్యూటీ, ఫర్నీచర్​, టివిలు, ఫుడ్​, టాయ్స్​, కిచెన్​ ఐటెమ్స్​పై భారీ డిస్కౌంట్​ ఇవ్వనుంది. దాంతో పాటు యాపిల్​, వివో, సామ్​సంగ్​, ఒప్పో కంపెనీల స్మార్ట్​ఫోన్లపై కూడా భారీ తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది.

ట్యాగ్స్​