మంచు యుగం నాటి ఏనుగు బోన్​ లభ్యం

By udayam on May 4th / 7:46 am IST

ఫ్లోరిడా వద్ద ఓ నదిలో ఈతకొడుతున్న ఇద్దరు స్కూబా డైవర్లకు మంచు యుగం నాటి ఏనుగు ఎముక లభ్యమైంది. 5‌‌0 పౌండ్ల బరువు, 4 అడుగుల ఎత్తు ఉన్న ఈ ఎముకను డెరెక్​ డిమిటర్​, హెన్రీ సాడ్లర్​లు గుర్తించారు. దీని వయసు సుమారు 26 లక్షల ఏళ్ళు ఉంటుందన్న వారిద్దరు సరిగ్గా వెదికితే ఇక్కడ మరిన్ని మంచుయుగం నాటి శిలాజాలు బయటపడవచ్చని తెలిపారు. ఇది చూడడానికి ఇటీవల వచ్చిన ఐస్​ ఏజ్​ సినిమాలోని ఏనుగు దంతంలా ఉందని వారు చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్​