కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమె రొటీన్ చెకప్ లో భాగంగానే ఆసుపత్రికి వెళ్ళారని ఆర్ధిక శాఖ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 1న దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సిన ఆమె ఆసుపత్రి పాలయ్యారన్న వార్తలతో దేశం ఉలిక్కి పడింది. ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఎయిమ్స్ చేరుకున్న ఆమె అక్కడి ప్రైవేటు వార్డులో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి భయాందోళన అవసరం లేదని తెలుస్తోంది.