కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ పోస్ట్ (భారత తపాలా శాఖ) తొలిసారిగా డ్రోన్‌ను ఉపయోగించి పోస్ట్‌ను డెలివరీ చేసింది. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 45 కి.మీ.ల దూరంలో డెలివరీకి 22 నిమిషాల సమయం పట్టింది. భుజ్‌కు సమీపంలోని హబే గ్రామానికి ఈ డ్రోన్ పోస్ట్ డెలివరీ జరిగింది. ఈ సక్సెస్‌తో భవిష్యత్తులో మరిన్ని డ్రోన్ డెలివరీస్ చేయడానికి ఇండియన్ పోస్ట్ సిద్ధమవుతోంది.