పురుషుల్ని దాటేసిన మహిళల శాతం

By udayam on November 25th / 9:42 am IST

భారత్​లో తొలిసారిగా మహిళల సంఖ్య పురుషులను దాటేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. జాతీయ కుటుంబ మరియు ఆరోగ్య సర్వేలో ప్రతీ 1000 మంది అబ్బాయిలకు 1020 మంది అమ్మాయిలు ఉన్నారని తేలింది. 1990లో ఈ సంఖ్య 1000 మంది పురుషులకు 927 మహిళలుగా ఉండేది. 2005–06 సర్వేలో 1000కు 1000 మంది ఉండగా 2015–16 నాటికి ప్రతీ 1000 మంది పురుషులకు 991 మంది మహిళలు మాత్రమే ఉండేవారు.

ట్యాగ్స్​