విశాఖలోని సింహాద్రి, హిందూజా ఎన్టీపీసీ ప్లాంట్లలో ఒకేసారి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. టెక్నికల్ ప్లాబ్లమ్ వల్లనే ఉత్పత్తి ఆగిందా.. లేక ఇంధన కొరత వల్ల నిలిపేశారా అన్నది తేలలేదు. ఎన్టీపీసీ సింహాద్రిలోని మొత్తం 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడంతో 2 వేల మె.వాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో సింహాద్రి ఎన్టీపీసీ యూనిట్‌కూ విద్యుత్ సరఫరా జరగడం లేదు. విశాఖలోని కలపాల 400 కేవీ స్టేషన్‌కు గ్రిడ్ నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.