కేంద్రం: వారికి 90 రోజులకే బూస్టర్​ డోస్​

By udayam on May 14th / 8:05 am IST

విదేశాలకు వెళ్ళే భారతీయులకు బూస్టర్​ డోస్​ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వారికి 2వ డోస్​ అనంతరం బూస్టర్​ డోస్​ వ్యవధిని 9 నెలల నుంచి 90 రోజులకు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ట్వీట్​ చేసింది. ఇప్పటికే గత నెల 18 నుంచి దేశంలో 18 ఏళ్ళు దాటిన వారికీ కేంద్రం బూస్టర్​ డోస్​ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మిగతా వారికి మాత్రం బూస్టర్​ డోస్​ గ్యాప్​ 9 నెలలుగా ఉంటుందని స్పష్టం చేసింది.

ట్యాగ్స్​