రూట్​.. సచిన్​ రికార్డ్​ను తిరగరాస్తాడు

ఇంగ్లాండ్​ లెజెండ్​ జాఫ్రే బాయ్​కాట్​

By udayam on January 27th / 6:57 am IST

టెస్టుట్లో సచిన్​ టెండుల్కర్​ సాధించిన రికార్డుల్ని ఇంగ్లాండ్​ టెస్ట్​ సారధి జో రూట్​ అందుకుంటాడని ఇంగ్లాండ్​ మాజీ దిగ్గజ క్రికెటర్​ జాఫ్రె బాయ్​కాట్​ అన్నాడు.

టెస్టుల్లో 15,921 పరుగులు చేసి ప్రపంచ రికార్డ్​ సృష్టించిన సచిన్​ను జో రూట్​ మాత్రమే అందుకోగలడని బాయ్​కాట్​ అంచనా వేశాడు.

శ్రీలంక పర్యటనలో రెండు భారీ శతకాలు చేసిన జో రూట్​పై ప్రశంసలు కురిపిస్తూనే అతడిని ప్రస్తుత తరానికి చెందిన క్రికెటర్లతోనే పోల్చాలని పేర్కొన్నాడు.

జో రూట్​ ప్రస్తుతం ఇంగ్లాండ్​ తరపున అత్యధిక పరుగులు చేసిన 4వ బ్యాట్స్​మెన్​. అయితే అతడు ఇప్పటికే 99 టెస్టులు ఆడేశాడు. ఇంకా 30 లలోనే ఉన్నాడు. కాబట్టి 200 టెస్టుల్ని సులువుగా ఆడేయగలడు. అదే సమయంలో సచిన్​ రికార్డ్​ను బద్దలు కొట్టేయగలడు అని పేర్కొన్నాడు.