అప్రూవర్​గా మారిన నారాయణ ప్రిన్సిపల్​

By udayam on May 10th / 12:37 pm IST

టెన్త్​ క్వశ్చన్​ పేపర్ల లీక్​ కేసులో గుంటూరు నారాయణ విద్యాసంస్థల వైస్​ ప్రిన్సిపల్​ గిరిధర్​ రెడ్డి అప్రూవర్​గా మారినట్లు పోలీసులు తెలిపారు. మాజీ మంత్రి, విద్యాసంస్థల అధినేత నారాయణ చెప్పడంతోనే పేపర్​ లీక్​ చేసినట్లు అతడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ప్రిన్సిపల్​ ఇచ్చిన వాంగ్మూలంతో నారాయణపై కేసు నమోదు చేశామని, ఈరోజు అరెస్ట్​ చేశామని పోలీసులు వెల్లడించారు. నారాయణతో పాటు ఆయన భార్య రమాదేవిని సైతం అరెస్ట్​ చేసి చిత్తూరుకు తీసుకొచ్చారు.

ట్యాగ్స్​