ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నాయకులు సోమవారం నాడు భారత రాష్ట్ర సమితిలో చేరారు. కేసీఆర్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తోట చంద్రశేఖర్, రావెల కిషోర్‌బాబు సహా పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రిటైర్డ్ ఐఏఎస్, వ్యాపారవేత్త తోట చంద్రశేఖర్ ఆ పార్టీకి ఏపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన గతంలో వైయస్సార్ కాంగ్రెస్, ప్రజారాజ్యం, జనసేన పార్టీల్లో పనిచేశారు. కాపునాడు నాయకుడు తాడిపాక రమేశ్, రిటైర్డ్ ఐఏఎస్ పార్థసారథి, కాపునాడు శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకుడు జె.టి.రామారావు, టి.జె.ప్రకాశ్‌లు పార్టీలో చేరారు.