కరోనా నియమాలు ఉల్లంఘన – మాజీ ఎంపీపై కేసు

By udayam on February 23rd / 7:17 am IST

పూణె: ఎంత కట్టడి చేసినా మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో  ఉద్ధవ్ సర్కారు కరోనా కట్టడికి పలు నిబంధనలు అమలయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఈ నేపధ్యంలో తాజాగా పూణెలో ఒక వీవీఐపీ వివాహ వేడుకలో లెక్కకుమించి అతిథులు హాజరు కావడంతో వివాహ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అతని కుమారుని వివాహానికి హాజరైన పలువురు వీవీఐపీలు మాస్కులు లేకుండా కనిపించారు.

అయితే  ఈ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు కూడా హాజరయ్యారు. కరోనా నియమాలు ఉల్లంఘించినందుకు బీజేపీ మాజీ ఎంపీ ధనంజయ్ మహాడిక్, లక్ష్మీ లాంజ్ యజమాని వివేక్ మగర్, మేనేజర్ నిరూపల్ కేదార్‌లపై హడప్‌సర్ పోలీసులు కేసు నమోదుచేసినట్లు పోలీసు అధికారి బాలకృష్ణ కదమ్ తెలిపారు.

ఈ పెళ్లికి ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన నేత సంజయ్ రావత్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు హాజరయ్యారు.

వారం రోజుల్లో ఐదుగురు మంత్రులకు కరోనా

కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మహారాష్ట్రలోని మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వంలోని 26 మంది మంత్రులకు కరోనా సోకింది. రాష్ట్రంలో మొత్తం 43 మంది మంత్రులుండగా వారిలో 26 మంది కరోనా బారిన పడటం సంచలనం రేపింది.

గత వారం రోజుల్లో ఐదుగురు మంత్రులకు అంటే  ఎన్సీపీకి చెందిన మంత్రి చగన్ భుజ్‌బల్‌తో పాటు జలవనరుల శాఖ మంత్రి జయంత్ పాటిల్, ఆహార మంత్రి డాక్టర్ రాజేంద్ర షింగే, ఆరోగ్యశాక మంత్రి రాజేష్ తోపేలకు కరోనా సోకింది. విద్యాశాఖ మంత్రి ఓంప్రకాష్ అలియాస్ బచ్చు కడూకు కరోనా రెండోసారి వచ్చింది.

ట్యాగ్స్​