అనారోగ్యంతో మాజీ మంత్రి బొజ్జల మృతి

By udayam on May 6th / 1:03 pm IST

సీనియర్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి శుక్రవారం అనారోగ్యంతో మరణించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయన మృతి పట్ల టిడిపి నాయకులతో పాటు పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బొజ్జల కుమారుడు సుధీర్, ఇతర కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ట్యాగ్స్​