ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. దివంగత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కేదార్‌సింగ్ మనవడిని కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. మవు జిల్లాలోని కోపాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పాత కక్షల నేపథ్యంలో 35 ఏళ్ల హిమాన్షు సింగ్‌ను మహువార్ గ్రామంలో శనివారం రాత్రి ఏడెనిమిది మంది కొట్టి చంపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు ఏఎస్పీ త్రిభువన్ నాథ్ త్రిపాఠీ తెలిపారు. హిమాన్షు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు.