కరోనతో సబ్బం హరి కన్నుమూత

By udayam on May 3rd / 9:52 am IST

టీడీపీ సీనియర్ నాయకుడు, అనకాపల్లి మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఈరోజు కరోనతో మరణించారు. గత నెల లో కరోనా బారిన పడిన ఆయన వైజాగ్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అప్పటికే ఆయనకి వివిధ ఆరోగ్య సమస్యలు ఉండడంతో పాటు కరోనా తీవ్రంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆయనకు వైద్యులు కాపాడలేకపోయారు. 1995లో వైజాగ్ కి మేయర్ గానూ, 2009 లో అనకాపల్లి ఎంపీ గానో పనిచేశారు.

ట్యాగ్స్​