విషమంగా మన్మోహన్​ ఆరోగ్యం

By udayam on October 13th / 7:04 pm IST

భారత మాజీ ప్రధాని, దిగ్గజ ఆర్ధిక వేత్త డాక్టర్​ మన్మోహన్​ సింగ్​ ఆరోగ్యం బుధవారం నాడు క్షీణించింది. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుత్తుండడంతో ఢిల్లీలోని ఎయిమ్స్​లో ఆయనను చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్​లో ఆయన కరోనా వైరస్​ బారిన పడి కోలుకున్నారు. ఇప్పటికే 2 డోసుల కరోనా వ్యాక్సిన్​ను సైతం మన్మోహన్​ తీసుకున్నారు.