బీజేపీలోకి పంజాబ్​ కెప్టెన్​.. పార్టీ సైతం విలీనం

By udayam on September 20th / 5:11 am IST

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారం కమలం పార్టీలోకి చేరారు. ల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అలాగే ఆయన పార్టీ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ను కాషాయ పార్టీలో విలీనం చేశారు. పంజాబ్​కు కాంగ్రెస్​ పార్టీ తరపున పంజాబ్​కు రెండుసార్లు సిఎంగా చేసిన ఆయనను సోనియమ్మ పక్కన పెట్టేయడంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన అనంతరం సొంత పార్టీ పెట్టి.. శిరోమణి అకాలీదళ్ పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేశారు.

ట్యాగ్స్​