ఇటీవలే కాంగ్రెస్‌కు గుడ్ బై కొట్టిన పంజాబ్ పిసిసి మాజీ చీఫ్ సునీల్ ఝక్కర్ ఈరోజు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కమల దళంలోకి చేరారు. పంజాబ్ సిఎంగా అమరీందర్‌ను తప్పించిన వెంటనే ఝక్కర్ ఆ రాష్ట్రానికి సిఎం కావాలని ఉవ్విళ్ళూరారు. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ చన్నీకి ఆ అవకాశాన్ని ఇవ్వడంతో అప్పట్లోనే కాంగ్రెస్ బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆపై కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.