ఉత్తరాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ ఈరోజు ఆత్మహత్యకు పాల్పల్డారు. తన కోడలు తనపై గృహ హింస కేసు పెట్టిందన్న ఉక్రోషంలో ఆయన వాటర్ ట్యాంక్ ఎక్కి తనను తాను కాల్చుకుని మృతి చెందారు. ఈ ఆరోపణలపై ఆయన చాలా బాధతో ఉండేవారని కుటుంబ సభ్యులు చెప్పినట్లు సీనియర్ పోలీస్ అధికారి పంకజ్ భట్ వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు ఆయన వరుసగా 112 ఎమెర్జెన్సీ నెంబర్కు కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారని సైతం ఆయన కుటుంబం వెల్లడించింది.