తాడేపల్లి గూడెంలో లారీ బోల్తా.. 4 గురు మృతి

By udayam on January 14th / 5:52 am IST

పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేపల లోడుతో నారాయణపురం నుంచి దువ్వాడ వెళుతున్న లారీ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయంలో లారీలో 10 మంది కూలీలు ఉన్నారు ఈ ఘటనలో గాయపడిన కూలీలను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తక్షణం సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్​