యుపిలో లారీ, సుమో ఢీ – 14 మంది మృతి

By udayam on November 20th / 7:15 am IST

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో గురువారం రాత్రి ప్రయాగ్‌రాజ్-లక్నో హైవేపై బొలెరో.. ట్రక్‌ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

మాణిక్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలికి వెళ్లి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

రెండు ప్రమాదాల్లో 20మందికి గాయాలు

కాగా ఏపీలోని ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం తొండపాడు గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. బస్‌స్టాప్‌లో ఆగి ఉన్న డీజిల్ ఆటోను వేగంగా వచ్చి లారీ ఢీకొట్టింది.  పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.