సంచలనాలకు మారుపేరుగా నిలిచిన మొరాకో ఫుట్ బాల్ జట్టు తన ప్రపంచకప్ డ్రీమ్ రన్ ను సెమీస్ తో ముగించింది. నిన్న రాత్రి ఫ్రాన్స్ తో జరిగిన 2వ సెమీస్ మ్యాచ్ లో 0–2 తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ మొదలైన 5వ నిమిషంలోనే ఫ్రాన్స్ ఆటగాడు తియో హెర్నాండేజ్ గోల్ వేసి ఫ్రాన్స్ కు ఆధిక్యం కట్టబెట్టాడు. సెకండాఫ్ లో మరోసారి ఫ్రాన్స్ ఆటగాడు రాండల్ కాలో మువానీ 79వ నిమిషంలో 2 వ గోల్ వేయడంతో మొరాకో ఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి. ఆదివారం జరిగే ఫైనల్ లో ఫ్రాన్స్.. అర్జెంటీనాతో తలపడనుంది.