ఫ్రెంచ్​ ప్రెసిడెంట్​కు చెంపదెబ్బ

By udayam on June 9th / 4:10 am IST

ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మేక్రాన్​ను ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్​ అవుతోంది. ఆగ్నేయ ఫ్రాన్స్​ పర్యటనలో భాగంగా ఆయన వలెన్స్​ పట్టణంలో ప్రజల వద్దకు వచ్చిన ఆయనన్ను ఓ వ్యక్తి ఎడమ వైపు చెంప మీద కొట్టాడు. వెంటనే స్పందించిన అధ్యక్షుడి రక్షణ బృందం అతడిని, అతడికి సహకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అయితే ఈ ఘటన అనంతరం ప్రెసిడెంట్​ తిరిగి ప్రజల వద్దకు వెళ్ళి మాట్లాడారు. ఆ వ్యక్తి అసలు ఎందుకు ప్రెసిడెంట్​ను కొట్టిందీ ఇంకా తెలియరాలేదు.

ట్యాగ్స్​