రాజస్థాన్​: నాకొద్దీ మంత్రి పదవి

By udayam on May 27th / 1:08 pm IST

రాజస్థాన్​ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అశోక్​ చంద్నా తనకు ఇచ్చిన మంత్రి పదవి వద్దని సిఎం అశోక్​ గెహ్లాట్​కు ట్విట్టర్​ సాక్షిగా ప్రకటించారు. తనపైనా, తన శాఖలపైనా సిఎం అశోక్​ ప్రధాన కార్యదర్శి కుల్దీప్​ రంకా జోక్యం మితిమీరిపోతోందని, కాబట్టి తన పోర్ట్​ఫోలియో అంతటినీ ఆయనకే ఇచ్చేయాలని ఆయన ట్వీట్​ లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సిఎం ‘మంత్రి చంద్నా చాలా సిన్సియర్​ వర్కర్​. ఆవేదనతోనే ఆ మాటలన్నారు. మేం సీరియస్​గా తీసుకోం’ అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్​