దేశ ద్రోహ చట్టం అమలుపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే ప్రకటించడాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. సుప్రీం నిర్ణయం చరిత్రాత్మకమని పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ ‘అధికారానికి అద్దం పట్టడం అంటే దేశ ద్రోహం కాదు. అది జాతీయవాదం’ అంటూ చేసిన ట్వీట్‌కు లైకుల వర్షం కురుస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తిన వారిని కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహులంటూ ముద్రవేయడం ఇకనైనా మానుకోవాలని పేర్కొన్నారు.