రాజస్థాన్​లో మత ఘర్షణలు…

By udayam on May 3rd / 7:00 am IST

రాజస్థాన్​లోని జోధ్​పూర్​లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పరశురామ జయంతి సందర్భంగా జలోరీ గేట్​ వద్ద ఓ వర్గం జెండాలు పెట్టడంతో సోమవారం రాత్రి వివాదం చెలరేగింది. దీంతో పోలీసులు ఈ ప్రాంతంలో ఇంటర్నెట్​ను నిలిపేశారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్​ ప్రార్థనల అనంతరం ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని జోధ్​పూర్​ పిసి నవజ్యోతి గొగోయి వెల్లడించారు.

ట్యాగ్స్​