బిఎల్​ సంతోష్​ పై కేసు వేసిన సిట్​

By udayam on November 24th / 8:17 am IST

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేశారనే కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. సంతోష్ తో పాటు తుషార్, జగ్గుస్వామిలపై కూడా కేసులు నమోదు చేశారు. మరోవైపు సంతోష్ కు మరోసారి నోటీసులు జారీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 41ఏ సీఆర్పీసీ కింద ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు. తమ విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు రెండు తేదీలను నోటీసుల్లో సూచించారు. ఈ నెల 26న లేదా 28న విచారణకు రావాల్సిందిగా పేర్కొన్నారు.

ట్యాగ్స్​