ఈటెలపై మరో భూకబ్జా కేసు

By udayam on May 3rd / 11:10 am IST

మెదక్​ జిల్లాలో అసైన్డ్​ భూములను కబ్జా చేశారని ఆరోపణలు రావడంతో మంత్రి పదవి కోల్పోయిన ఈటెల రాజేందర్​పై ఇప్పుడు మరో భూకబ్జా ఫిర్యాదు వచ్చింది. దీనిపై కూడా ప్రభుత్వం తక్షణ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దేవరయాంజల్​లోని సీతారామచంద్రస్వామి ఆలయానికి చెందిన 1521 ఎకరాల భూమిలో కబ్జాకు పాల్పడ్డారంటూ లోకాయుక్తకు అందిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించి విచారణ చేయిస్తోంది. సీనియర్​ ఐఏఎస్​ ఆఫీసర్లు రఘనందనరావు, ప్రశాంత్​ జీవన్​, భారతీ హోలికేరి, శ్వేతా మహంతిలు ప్రభుత్వం నియమించిన కమిటీలో ఉన్నారు.

ట్యాగ్స్​