500 మందిని కోటీశ్వరుల్ని చేసిన కంపెనీ

By udayam on September 24th / 4:00 am IST

భారత దిగ్గజ సీఈఓల్లో ఒకరైన గిరీష్​ మాతృభూతం తన కంపెనీలోని 500 మంది ఉద్యోగులను ఒకేరోజు కోటీశ్వరుల్ని చేశారు. అదెలా అంటే బుధవారం ఆయన కంపెనీ ఫ్రెష్​వర్క్​ నాస్​డాక్​ (అమెరికా స్టాక్​ మార్కెట్​)లో లిస్టింగ్​ అయింది. అయితే ఈ కంపెనీ లిస్ట్​ అయిన తొలి రోజే ఫ్రెష్​వర్క్​ షేర్లు 32 శాతం పెరిగాయి. ప్రస్తుతం 4300 మంది ఉద్యోగులున్న ఈ కంపెనీలో 76 శాతం మంది వద్ద ఈ కంపెనీ షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఫ్రెష్​వర్క్ మార్కెట్​ విలువ 13 బిలియన్​ డాలర్లకు చేరుకుంది.

ట్యాగ్స్​