భద్రాద్రి శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలో మరోసారి బూజుపట్టిన లడ్డూలు కలకలం సృష్టించాయి. స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ కొనగోలు చేసిన భక్తులు, లడ్డూలు వాసన రావడంతో సిబ్బందిని నిలదీశారు. బూజు పట్టిన లడ్డూలు ఎళా విక్రయిస్తారని నిలదీశారు. ‘ఇచ్చట బూజు పట్టిన ప్రసాదం లడ్డూలు ఇస్తారు’అని పేపర్ మీద రాసి కౌంటర్ కి తగిలించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందించాల్సి ఉంది.