G2: అడివి శేష్​ నుంచి మరో పాన్​ ఇండియా మూవీ

By udayam on December 29th / 12:18 pm IST

టాలీవుడ్​ మోస్ట్​ టాలెంటెడ్​ యువ హీరో అడవి శేష్​ మరో పాన్​ ఇండియా ప్రాజెక్ట్​ ను సిద్ధం చేస్తున్నాడు. అతడి కెరీర్​ ను కీలక మలుపు తిప్పిన గూఢచారి (2018) కి కొనసాగింపుగా జి2 (గూఢచారి–2) ని ప్రకటించారు. కెరీర్లో మేజర్​, హిట్​–2 తో వరుష హిట్లతో దూసుకుపోతున్న అతడు తన తర్వాత ప్రాజెక్ట్​ గా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ప్రీ విజన్​ వీడియోను జనవరి 9న లాంచ్​ చేయనున్నారు. మేజర్​ కు ఎడిటర్​ గా పనిచేసిన వినయ్​ కుమార్​ సిరిగినీడి ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు.

ట్యాగ్స్​